పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం

హర్ప్రీత్ బ్రర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’

'Man of the Match' for Harpreet Burr
‘Man of the Match’ for Harpreet Burr

ఐపిఎల్ పోరులో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాట్స్ మెన్స్ బెంబేలెత్తి పోయారు. హర్ప్రీత్ బ్రర్ ఆర్సీబీ పరుగులకు అడ్డుకట్ట వేసాడు. .విరాట్ కోహ్లీ(35), గ్లెన్ మ్యాక్స్‌వెల్(0), ఏబీ డివిలియర్స్(3) వంటి కీలక వికెట్లను వెంటవెంటనే పడగొట్టి బెంగుళూరు జట్టును ఓటమి అంచుల్లోకి నెట్టాడు. హర్షల్ పటేల్(31 నాటౌట్), కైల్ జేమీసన్(16 నాటౌట్) ధాటిగా ఆడినా అప్పటికే విజయానికి జట్టు దూరమైపోయింది. 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రర్‌ 3 వికెట్స్ , రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టాడు.తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్..ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(91) ఆర్సబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీ తృటిలో మిస్ చేసుకున్నాడు. పంజాబ్ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ 6 పాయింట్లతో 5వ స్థానానికి చేరింది. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల తీసిన హర్ప్రీత్ బ్రర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/