హైదరాబాద్ కు రాబోతున్న మరో భారీ పెట్టుబడి సంస్థ

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర రూపు రేఖలే మారిపోతున్నాయి. కేవలం రాజధాని హైదరాబాద్ మాత్రమే కాదు పల్లె టూర్ సైతం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు రాగా..తాజాగా మరో భారీ సంస్థ రాబోతుంది.
హైదరాబాద్ నగరంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆక్యుజెన్ సంస్థ ప్రకటించింది. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆక్యుజెన్ ప్రతినిధులు సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించారు. ఆక్యుజెన్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆక్యుజెన్ పరిశోధన కేంద్రం లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేటీఆర్ వివరించారు. 250 బిలియన్ డాలర్ల సాధనలో ఆక్యుజెన్ నిర్ణయం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు.