అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..

అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంలో వరుసపెట్టి అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల వల్ల కోట్లాది ఆస్తి నష్టాలతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. తాజాగా అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

అత్తాపూర్ లోని బాడీ బిల్డింగ్ షోరూం లో అకస్మాత్తగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురై.. ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులు పరిశీలించారు. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురైనట్లు స్థానికులు తెలిపారు.