ప్రధానికి ఉన్న విజన్‌ కొరతే ఈ అన్ని సమస్యలకు మూలం : కేటీఆర్

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న‌లో బొగ్గు నుంచి విద్యుత్తు వ‌ర‌కు కొర‌త ఏర్ప‌డింద‌ని తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, అన్ని సమస్యలకు మూలం ప్ర‌ధాని మోడీకి విజన్ కొరత’ అని కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న‌ బొగ్గు, విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ ఉన్న ఓ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/