ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశం ముగిసింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం.. సాయంత్రం 6:15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌ల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ స‌మావేశానికి మంత్రులు, సీఎస్ శాంతి కుమారితో పాటు ప‌లు శాఖ‌ల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధి తీరుతెన్నును ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.