కరోనాపై పరిశోధన

ఆరోగ్య భాగ్యం

Research on the corona
Research on the corona

కరోనా ఇప్పటి వరకు జరిగిన పరిశోధన ప్రకారం జూనోటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ తర్వాత మానవులలో సహజంగా వైరస్‌ స్టెయిన్‌ను ఎంచుకోవడం ద్వారా సార్స్‌ – కోవిడ్‌ – 2 వచ్చిందని ఒక సిద్ధాంతం.

మరోవైపు కరోనా మానవులలో జునోటిక్‌ బదిలీకి ముందు మానవేతర జంతు హోస్ట్‌లలో సహజంగా వైరస్‌ స్టెయిన్‌ను ఎంచుకోవడం ద్వారా కరోనా వైరస్‌ ఉద్భవించిందని తెలుస్తున్నది..

ఇది బయటపడడానికి ముందే దీని మూలాలు వివిధ రకాలుగా మానవులలో తిరుగాడిందని తెలుస్తున్నది.

జన్యు సిద్ధాంత రీత్యా ఈ వైరస్‌ గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించే ముందే మరేదైనా హోస్ట్‌కి సోకి అక్కడ రూపాంతరం చెంది అటునుంచి మనుషులకు వచ్చి ఉంటుందనే వాదన ఉంది.

మానవ సంక్రమణ తీవ్రత, వ్యాప్తికి అనుకూలమైన సార్స్‌ – కొవిడ్‌ -2లోని ఉత్పరివర్తనలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

భవిష్యత్‌లో ఇది మనుష్యులపై ఎటువంటి తీవ్ర పరిణామాల్ని కలిగిస్తుందో కూడా తెలియడం లేదు.

జంతువుల నుండి వచ్చిన కరోనావైరస్‌ గబ్బిలాలు, కొన్ని రకాల పిల్లి జాతులు, కోతుల్లోని స్వైన్‌ కణాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని మాలిక్యులార్‌ బయాలజీ ప్రకారం తెలుస్తుంది.

కాని పెంపుడు జంతువులు (కుక్కలు, పశువులు) పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, చికెన్‌, మాంసం తీసుకోవడం ద్వారా తెలిసింది.

వైరస్‌ ప్లాస్టిక్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపరితలాలపై మూడు రోజుల వరకు ఉంటుంది.

వైరల్‌లోడ్‌ 10000 పిఎఫ్‌ఒ ఉన్నప్పుడు వార్తాపత్రికలు, కాటన్‌ వస్త్రాలపై, పాలప్యాకెట్‌లపై 5 నిమిషాలుంటుంది.

కాబట్టి వైరస్‌ సంక్రమణని తొలగించడానికి పాలప్యాకెట్లని కడిగితే సరిపోతుంది.

వార్తాపత్రికలు చదవడానికి ముందు, తర్వాత చేతుల్ని కడుక్కోవడం, పేపర్‌ని ఎండలో కొద్దిసేపు ఆరబెట్టడం చేస్తే సరిపోతుంది.

కొంతమంది పేపర్‌ని ఐరన్‌ చేసి చదవడం జరిగింది. అలాగే బయటి నుండి తెచ్చిన కూరగాయలలు పండ్లని కూడా కడిగి ఆరబెట్టిన తర్వాతనే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

అధిక ఉష్ణోగ్రత, గాలిలో తేమ, మంచు, చల్లనిగాని, వర్షానికి అనుగుణంగా వైరస్‌ వ్యాప్తి, సంక్రమణ తగ్గుతుందనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు.

ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నివారణే శరణ్యం.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ సోకవచ్చా?

మామూలుగా ఒకసారి వైరస్‌ సోకిన తర్వాత చాలా మందిలో దానికి సంబంధించి జీవిత కాల రోగనిరోధకశక్తి పెంపొందుతుంది.

కోలుకున్న వారిలో వైరస్‌ తిరిగి సంశ్లేషణ చెందినట్లు కూడా ఆధారాలు లేవు.

రోగనిరోధక శక్తి వైరస్‌ని ఎంతకాలం, ఎంతవరకు నిలువరిస్తుందో ఇప్పటికిప్పుడు తెలుసుకోలేము.

హోమియోలో ఆర్స్‌ ఆల్బ్‌ 30 మందు, ఆయుర్వేద మందులు వైరస్‌ని సమర్ధవంతంగా ఎదుర్కొని యాంటిబాడీస్‌ని పెంపొందించ గలవని నిరూపణ అయింది.

కరోనా మరణాలకు కారణమేంటి?:

ఈ వైరస్‌ సోకిన వాళ్లలో చాలా వరకు గుండె దెబ్బతినడం, హార్ట్‌ ఫెయిల్యూర్‌ ముఖ్య కారణం, స్ట్రెస్‌, మానసిక స్థైర్యం లేకపోవడం, డిప్రెషన్‌, భయం దీనికి దోహదం చేస్తున్నాయి.

ఊపిరితిత్తులు కపంతో నిండిపోవడం, జీవద్రవం లీకేజ్‌ కావడం, శ్వాసకోశ వైఫల్యం వల్ల శ్వాసక్రియని నిరోధించడం వల్ల ఊపిరాడక, ఆయాసంతో లంగ్‌ ఫెయిల్యూర్‌ ఏర్పడుతుంది.

కొంతమందిలో రక్తసరఫరా, సరిగా లేకపోవడం, ఆక్సిజన్‌ అందకపోవడం, శరీరంలో మెటబాలిజమ్‌లో తీవ్రమైన మార్పుల వల్ల బ్రెయిన్‌స్ట్రోక్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి.

అందువల్ల ప్రధానంగా అత్యవసర చికిత్స అవసరమవుతుంది.

డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/