ఒత్తిడి తగ్గించే కరివేపాకు టీ

ఆరోగ్యం.. అలవాట్లు

తరచూ టీ తాగితే ఒంటికి మంచిది కాదు.. కానీ, రోజుకొక్క సారైనా ఈ కరివేపాకు చాయ్ తాగితే మాత్రం రుచితో పాటు ఆరోగ్యం కూడా. అది ఎలాగంటారా?

గుప్పెడు కరివేపాకులను కడిగి నీళ్లలో వేసి మరిగించండి.. ఆపై వడకట్టి కాస్త పాతిక బెల్లం వేసుకునే తాగి చూడండి.. ఆ ఆకుల సువాసన నరాలను రిలాక్స్ చేస్తుంది.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది… అంతేకాదు.. కరివేపాకులో ఫినోలిక్స్ అనే యాంటీ ఆసిడ్ చర్మ వ్యాధులను నయం చేస్తుంది.. కరివేపాకు చాయ్ రోజూ తాగితే ఇందులోనే విటమిన్లు , ఖనిజాలు కంటి చూపుని మెరుగు పరుస్తాయి… వ్యాధి నిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని మెరిపిస్తాయి.

మధుమేహం ఉన్నవారు కరివేపాకు టీ ని తాగితే చాలు. షుగర్ లెవెల్స్ ను ఎంచక్కా సమన్వయం అవుతాయి.. పని ఒత్తిడి , మారిన ఆహారపు అలవాట్లు , జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఈ ఇబ్బందులతో బాధపడేవారు రోజూ వేడి వేడిగా ఈ చాయ్ ని తాగితే సరి.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటమే కాదు.. మెదడుకీ ఉపశమన లభిస్తుంది..

తాజా జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/national/