వంటగ్యాస్‌ ఆదా ఇలా

మనం అప్పుడప్పుడూ తెలియకుండానే వంటగ్యాస్‌ని వృథా చేస్తుంటాం. దానికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మరి ఆదా చేయాలంటే.. వంటకు తగ్గట్లుగా మంట ఉంచేలా చూసుకోవాలి. చిన్నమంట ఉంటే గ్యాస్‌ ఎక్కువగా ఖర్చు కాదు. కూరలు నెమ్మదిగా ఉడికి, రుచిగానూ ఉంటాయి. పోషకాలు కోల్పోవు.
పొయ్యి మీద పెట్టే గిన్నె స్టవ్‌ బర్నర్‌కు సరిపోయేలా ఉండాలి. అలాకాకుండా పెద్ద గిన్నె ఉంచితే, మంట వేడి దానికి సరిగ్గా అందదు. వంట పూర్తి కావడానికి అధిక సమయం పడుతుంది. గ్యాస్‌ వృథా అవుతుంది. స్టవ్‌కు తగ్గట్లుగా గిన్నె పరిమాణం ఉండాలి.
వంట అయిన తరువాత స్టవ్‌ బర్నర్లను శుభ్రం చేసుకోవాలి. లేదంటే వంట వ్యర్థాలు చేరిపోయి, గ్యాస్‌ రావడానికి నిరోధకంగా మారుతుంది. దీంతో మంట పసుపు, నారింజ రంగులో వస్తుంది. అదే జరిగితే వ్యర్థాలున్నట్లు గుర్తించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది.
స్టీలు, రాగి అడుగు ఉన్న గిన్నెల కన్నా ఇనుప పాత్రలు వంటకు అనువైనవి. ఈ పాత్రలు వేడెక్కిన తరువాత
అధిక సమయం ఆ వేది ఉంటుంది. దీని వల్ల గ్యాస్‌ తక్కువగా ఖర్చు అవుతుంది.
అన్నం, పప్పు, కూరగాయలు వంటి వాటిని ఒకేసారి వేర్వేరు గిన్నెల్లోకి తీసుకుని ప్రెషర్‌కుక్కర్‌లో ఆవిరిపై ఉడికించుకోవడం మంచిది. ఆరోగ్యమే కాదు, సమయంతో పాటు గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది.
పొయ్యిపై ఉంచిన గిన్నెకు మూత ఉంచాలి. ఆహారం ఉడుకు తున్నప్పుడు మూత ఉంటే ఆవిరికి కూర త్వరగా సిద్ధమవు తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/