ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు బోగీలు పూర్తిగా దగ్ధం

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన లో దాదాపు 270 మంది చనిపోయి..ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. ఈ ప్రమాద ఘటన తర్వాత కూడా ఒడిశాలో పలు ప్రమాదాలు జరిగాయి. ఒక్క ఒడిశా లోనే కాదు ఈ మధ్య వరుసగా పలు జిల్లాల్లో వరుస ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో బండాయి రైల్వే స్టేషన్‌ సమీపంలో…పంజాబ్‌లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న పటల్‌కోట్ అనే ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3.45 ఈ ఘటన జరిగింది. ముందుగా రెండు బోగీలకు మంటలు అంటుకోవడంతో.. అవి మరింత వ్యాపించకుండా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.