హైదరాబాద్ సైక్లింగ్ ట్రాక్‌ ఫై బర్రెల వాకింగ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో కంపెనీ లు హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతూ లక్షలాదిమందికి జాబ్స్ ఇస్తున్నాయి. అలాగే రోజు రోజుకు హైదరాబాద్ లో సరికొత్త గా డెవలప్ అవుతూ వస్తుంది. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, మెట్రో రైలుతో పాటు ఔటర్ రింగు రోడ్లు, షాపింగ్‌ మాల్స్ ఇలా ఒకటింటే ఎన్నో ఏర్పాటు చేస్తూ.. నగరవాసుల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే.. నగరవాసుల కోసం ప్రత్యేకంగా అర్బన్ పార్కులు వాకింగ్ ట్రాకులతో పాటు ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా సైక్లింగ్ ట్రాక్‌ కూడా ఏర్పాటు చేశారు. నగరవాసుల్లో ఎక్కువ మంది తన ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి.. ఇటీవలే ప్రారంభించారు. అయితే.. ఈ ట్రాక్‌పై సైక్లింగ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. బర్రెలు మాత్రం వాకింగ్ ట్రాక్‌గా వాడుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.