ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

నగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్ అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు అనుమానిత ఉగ్రవాదులు రహస్యంగా భారత్ లోకి చొరబడి సైనికులపై దాడి చేశారు. సైనికులు అప్రమత్తమై ఉగ్రవాదులపై ఎదరు కాల్పులు జరిపారని తెలిపారు. ఈ సమయంలో కొందరు అనుమానిత ఉగ్రవాదులను గుర్తించామని, సైనికులు ఎన్కౌంటర్ ని కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/