రైల్వే ఛార్జీల పెంపు..నేటి నుంచి అమలు

train
train

న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాన్యుడిని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయం మంగళవారం అర్ధరాత్రి నుండే అమలులోకి వచ్చింది. అంటే కొత్త సంవత్సర ప్రారంభపు గడియల నుండే ప్రయాణీకులపై పెంపు భారం పడనుంది. ఈ మేరకు రైల్వేశాఖ ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే సీట్లను బుక్‌ చేసుకున్న వారు అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎసి క్లాసుల్లో కిలోమీటర్‌కు నాలుగు పైసలు చొప్పున, ఆర్డినరీ నాన్‌ సబ్‌ఆర్బన్‌లోని నాన్‌ఎసి తరగతులకు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున, అదేవిధంగా మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ల్లో నాన్‌ఎసిలకు కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున పెంచింది. అయితే సబ్‌అర్బన్‌ ట్రైన్లలో ప్రయాణించే వారికి మాత్రం ఛార్జీలను పెంచలేదు. నూతన ఛార్జీలను జనవరి 1, 2020 నుంచి ప్రతి రైల్వే స్టేషన్‌లో ప్రదర్శిస్తామని రైల్వే శాఖ పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/