ఈసారి కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్న చంద్రబాబు-బాలయ్య లు

సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. సినీ, రాజకీయ , సామాన్య ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి పండగను నారా చంద్రబాబు , నందమూరి బాలకృష్ణలు కలిసి జరుపుకోబోతున్నారు. సంక్రాంతికి సొంత ఊరికి నారా,నందమూరి కుటుంబాలు వెళ్ళబోతున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా గ్రామానికి రాని రెండు కుటుంబాలు..మూడేళ్ల తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు,బాలకృష్ణ కుటుంబాలు వస్తున్నాయి. ఇక ఇరు కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహ రెడ్డి మూవీ ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.