వారి తప్పులను క్షమించి, ప్రేమను కురిపిద్దాం

కలలను నెరవేర్చుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలన్న సచిన్‌

Sachin Tendulkar
Sachin Tendulkar

ముంబయి: పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి, వారిపై ప్రేమను కురిపించాలని భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ అన్నారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టేందుకు కేటాయిద్దామని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారుల కోసం తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్య, పౌష్ఠికాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. పిల్లలకు ఆటలు మనోవికాసాన్ని అందిస్తాయన్నారు. పిల్లలు ఆటలు ఆడుకునేందుకు సరైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సచిన్‌ అన్నారు. ఆటలు చిన్నారులను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయని, వారిలో క్రీడా స్పూర్తి కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/