అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లడ్డూలు

ప్రత్యేక కార్గో ఛాపర్‌లో తిరుమల శ్రీవారి లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు..ఇప్పుడు దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. అయోధ్యకు పంపించడానికి ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేసిన టీటీడీ.. ఈ రోజు ఉదయం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు.

అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుంది.. దాని అనుగుణంగా లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించారు.