టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి..?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ వైస్సార్సీపీ కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చడం..సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది నేత వైసీపీ ని వీడి టిడిపి , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు చేరగా..మరికొంతమంది ఇదే బాటలో పయనిస్తున్నారు.

తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సైతం సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్‌ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించడం ఫై పార్థసారథి ఆగ్రహం తో ఉన్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరాలని పార్థసారథి భావించారు. కానీ రేపు చంద్రబాబు అయోధ్య కు వెళ్తుండడం తో తన చేరిక ను వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటె పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న పార్థసారథికి నూజివీడు ఆప్షన్ ఇస్తోంది టీడీపీ అధిష్ఠానం. ఆయనకు పెనమలూరు నుంచి టికెట్ ఇచ్చేందుకు స్థానిక టీడీపీ నేతలు ఒప్పుకోవట్లేదు. చంద్రబాబుపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్థసారథి సీటుపై టీడీపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పెనమలూరు స్థానాన్ని ఎప్పటి నుండి టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కాదని పార్థసారధి కి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.