భారత్‌లో కొత్తగా 45,882 కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 90,04,366..మొత్తం మృతులు సంఖ్య 1,32,162

india – corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 45,882 క‌రోనా కేసులు క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366కు చేరింది. ఇందులో 4,43,794 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మ‌రో 84,28,410 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 1,32,162 మంది మ‌ర‌ణించారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 584 మంది బాధితులు క‌రోనాతో మృతిచెంద‌గా, 44,807 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కాగా, గ‌త‌కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా యాక్టివ్ కేసులు నిన్న పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 491 యాక్టివ్ కేసులు అధిక‌మ‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/