పింఛన్‌, రేషన్‌ కట్‌ చేస్తామంటూ తెలంగాణ సర్కార్ స్వీట్ వార్నింగ్

తెలంగాణ సర్కార్ పింఛన్‌, రేషన్‌ తీసుకునే వారికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై చర్యలు తీసుకునేందు సిద్దమైన సర్కార్‌.. రాష్ట్రంలో ఎవరైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే…. వారి రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు.

ఈ నిబంధనలు నవంబర్‌ 1 వ తేదీ నుంచే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్‌ ను అరికట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 179 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు కరోనా సోకి మరణించారు. అలాగే.. 104 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఇదిలా ఉంటె .. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడం..అది కూడా రెండు డోసుల టీకాలు వేసుకున్న కానీ ఏవై.4 కరోనా వేరియంట్ బారిన పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మధ్యప్రదేశ్​ ఇండోర్ లో ఏడుగురికి ఏవై.4 రకం కరోనా కొత్త వేరియంట్​ సోకినట్లు తేలింది. మహారాష్ట్రలో 1 శాతం నమూనాలలో కొత్త డెల్టా ఏవై.4 వేరియంట్ కనుగొనబడింది.