టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డి

TTD chairman YV Subba Reddy

తిరుమల: తిరుమలలో ఆలయ అర్చకులు, జీయర్లు, టీటీడీ అధికారులు కరోనా బారిన పడ్డా విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి జగన్ టీటీడీ ఛైర్మన్ గా నియమించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/