నవంబర్‌లో నేపాల్‌ వెళ్లనున్న ఆర్మీ చీఫ్‌

ఆర్మీ చీఫ్ న‌ర‌వాణేను స‌త్క‌రించ‌నున్న నేపాల్

MM Naravane

న్యూఢిల్లీ: భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే వ‌చ్చే నెల‌లో ఖాట్మాండు వెళ్ల‌నున్నారు. న‌వంబ‌ర్‌లో న‌ర‌వాణే త‌మ దేశానికి రానున్న‌ట్లు నేపాల్ ఆర్మీ ఓ ప్ర‌ట‌క‌న‌లో పేర్కొన్న‌ది. వాస్త‌వానికి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీనే ఆర్మీ చీఫ్ విజిట్‌కు ఆమోదం ద‌క్కింద‌ని, కానీ లాక్‌డౌన్ వ‌ల్ల ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు నేపాల్ ఆర్మీ పేర్కొన్న‌ది. రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న ఉన్న‌త స్థాయి బృందం విజిట్ కూడా ఇదే కానున్న‌ది. కాగా ఈ సందర్భంగా నేపాల్ గౌర‌వ జ‌న‌ర‌ల్ ర్యాంక్‌తో ఆర్మీ చీఫ్ న‌ర‌వాణేను నేపాల్ అధ్య‌క్షురాలు బిద్యా దేవి భండారి స‌త్క‌రించ‌నున్నారు. 1950 నుంచి రెండు దేశాలు ఆర్మీ చీఫ్‌ల‌ను ప‌ర‌స్ప‌రం స‌త్క‌రించుకుంటున్నాయి. ఆ సాంప్ర‌దాయంలో భాగంగా న‌ర‌వాణే నేపాల్ వెళ్ల‌నున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/