ఈరోజు నుండి TSRTC లో లక్కీడ్రా ప్రారంభం

తెలంగాణ లో అతి పెద్ద పండగ దసరా. ఈ సందర్బంగా TSRTC ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈరోజు నుండి ఈ నెల 30 వరకు లక్కీడ్రా ను నిర్వహిస్తుంది. ఈ లక్కీ డ్రా ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగడు బహుమతులను సంస్థ అందిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు టికెట్‌ వెనుక తమ పేరు, ఫోన్‌ నంబర్‌ను రాసి, బస్టాండ్లలో ఏర్పాటుచేసిన డ్రాప్‌ బాక్సుల్లో వేయాలని ప్రయాణికులకు సూచించారు.

ఇక దసరా సందర్బంగా TSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. 5 వేల ఐదు వందల బస్సులను ఏర్పాటు చేసారు. గతంలో కంటే 20 శాతం బస్సులు అదనంగా పెంచారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు MD సజ్జనార్ తెలిపారు. అలాగే పండగ సీజన్లో అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన TSRTC గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ మొదలు పెట్టింది. ఆదివారం నుంచి ఈ ఛాలెంజ్ మొదలైంది. ఇందులో భాగంగా ప్రతి రోజు అదనపు సర్వీసుల్ని నడుపుతోంది ఆర్టీసీ. రోజుకి లక్ష కిలోమీటర్ల మేర అదనపు సర్వీసులు కవర్ చేయాల్సి ఉంటుంది.

సిబ్బంది కొరతతో ఇప్పటికే ఉన్నవారికి సెలవల విషయంలో వెసులుబాటు దొరకడంలేదు. అందులోనూ పండగ సందర్భాల్లో సిబ్బంది కొరత మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే వీక్లీఆఫ్ లు, సీఆఫ్ లు లేకుండా పనిచేస్తే క్యాష్ అవార్డులు ఇవ్వడానికి ఆర్టీసీ సిద్ధపడింది. పండగ సీజన్ ని మిస్ చేసుకోకుండా, సిబ్బందికి కూడా అదనపు ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేసింది యాజమాన్యం.