నేడు గవర్నర్‌తో సమావేశం కానున్న సిఎం
రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చ

అమరావతి: ఏపి సిఎం జగన్ ఈరోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నారు. మూడు రాజధానులు అంశం, రైతుల ఆందోళనలపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై ఇరువురి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/