బిజెపిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపులో చాలా మందే ఉన్నన్నట్టున్నారుః కెటిఆర్‌

ఫేక్ సర్టిఫికెట్లు ఉన్న ఈ ఇద్దరు తెలంగాణ బిజెపి ఎంపీలపై అర్హత వేటు వేయగలరా?..కెటిఆర్‌

ts-minister-ktr

హైదరాబాద్‌ః ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ పై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. మోడీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. మరోవైపు, ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి బిజెపిపై తెలంగాణ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు.

బిజెపిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లని చెప్పారు. రాజస్థాన్, తమిళనాడు యూనివర్శిటీల్లో చదివినట్టు వారి వద్ద తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ వీటిని పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? అని ప్రశ్నించారు.