దుబ్బాక..10 రౌండ్లో టిఆర్ఎస్ హవా

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి 5, 8, 9, రౌండ్లలో బిజెపి ఆధిక్యంలో ఉండగా..6, 7, 10, రౌండ్లలో టిఆర్ఎస్కు ఆధిక్యం లభించింది. కాగా పదో రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ 456 ఓట్లతో ముందంజలో ఉంది. 6, 7, 10 రౌండ్లలో టిఆర్ఎస్ పార్టీ 353, 182, 456 ఓట్ల మెజార్టీ సాధించింది. దౌల్తాబాద్, చేగుంట, రాయపూర్ మండలాల ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. పది రౌండ్లు పూర్తయ్యే సరికి బిజెపి 31783, టిఆర్ఎస్ 28049, కాంగ్రెస్ పార్టీ 6699 ఓట్లు సాధించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/