ఇప్పుడు దేశానికి కావల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్ మెంట్ ఫైల్స్ : కెసిఆర్

కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ..ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రస్తావించిన కేసీఆర్

cm-kcr

హైదరాబాద్ : ఇటీవ‌ల విడుద‌లైన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో స్పందించారు. దేశంలో సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిత్రాన్ని విడుదల చేశారని ఆరోపించారు. రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ సినిమాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. నాడు కశ్మీర్ లో పండిట్లను ఊచకోత కోసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశానికి కావల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని, డెవలప్ మెంట్ ఫైల్స్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజర‌య్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/