వారం రోజుల్లో గ్రూప్-4 ఫలితాలు..?

గ్రూప్-4 పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేసేందుకు TSPSC కసరత్తు చేస్తోంది. గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలపై ఛైర్మన్ మహేందర్ రెడ్డి వివరాలు తెలుసుకుంటున్నారు. త్వరలోనే పరీక్షల నిర్వహణ, ఫలితాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. గ్రూప్-4కు సంబంధించి మొదట జనరల్ ర్యాంకు లిస్ట్ విడుదల చేసి, అనంతరం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆగిన పరీక్ష ఫలితాలు కూడా త్వరలోనే ఇవ్వాలని కమిషన్ సిద్దం అయింది. దానికి సంబంధించిన ప్రాసెస్ సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారం రోజుల్లో TSPSC Group 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

మొత్తం 8,180 పోస్టులకు TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా..జూలై 1 న పరీక్ష నిర్వహించింది 9,51,205 మంది అభ్యర్థులు గ్రూప్ 4 కి అప్లయ్ చేయగా,7,62,872 మంది పేపర్ 1, 7,61,198 మంది పేపర్ 2 రాశారు. అయితే 5 నెల కిందే ఫైనల్ కీ విడుదల అయినప్పటికీ ఫలితాలు మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ కొంత మేరకు పూర్తీయి రెడీ గా ఉండటంతో , మిగితా ప్రాసెస్ కంప్లీట్ చేసి రిజల్ట్ ప్రకటించాలని కమిషన్ భావిస్తుంది.