శ్రీకాకుళం జిల్లాలో రూ. 2.10 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Cases on red sandalwood smugglers
red sandalwood

అమరావతిః ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 2.10 కోట్ల విలువైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 12 మందిని టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. గడిచన కొన్ని నెలలుగా ఏపీ పోలీసులు, అటవి శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచి ఎర్ర దుంగల నిల్వలపై సంయుక్త దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు.

స్మగర్లను, సహకరిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. వాహనాల తనిఖీలోనూ ఎర్ర దుంగలను పట్టుకుంటున్నారు. శేషాచలం అడవుల్లో ఉండే ఎర్ర చందనం చెట్ల నరికివేత నిషేదమైనప్పటికీ డబ్బు సంపాదనతో కొందరు స్మగర్లు చెట్లను నరికి వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఎర్రచందనానికి బహిరంగ మార్కెట్లో భారీ ధర పలుకుతుండడంతో స్మగ్లర్లు భారీగా చెట్లను నరికి తరలిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/