ఉచిత వ్యాక్సి నేషన్ కు తెలంగాణ సర్కారు కసరత్తు

18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా

Corona Vaccine
Corona Vaccine

Hyderabad: కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. మే 1 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం కానుండగా, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ చేస్తే.. ఎంత బడ్జెట్‌ అవుతుందన్న అంశంపై కసరత్తులు చేస్తోంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/