విశాఖలో భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్
టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ

Amravati: విశాఖలోని భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలోని ఖరీదైన భూములను అమ్మేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించగా.. కోర్టు స్టే ఇచ్చిందని, ఇప్పుడు మరో పేరుతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు .. విశాఖలో మొత్తం ఐదు చోట్ల భూములు అమ్మటానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరాడు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం… బిల్డ్ ఏపీపై ఇచ్చిన స్టే ఆదేశాలే విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తాయని పేర్కొంది. టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/