రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడండి: సీఎం కేసీఆర్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లో రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యుహాంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశంలో.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించ్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలు చేశారు.కేంద్రంతో ఇక యుద్ధమే అని ఎంపీ లతో తెల్చి చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తో అమీతుమీకి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సుదీర్ఘ చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన వినతులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై సీఎం ఎంపీలతో చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ చర్చించారు. కేంద్రంపై అనుసరించాల్సిన వ్యవహారంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఆ నివేదికను సీఎం కేసీఆర్ అందించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/