నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. దీని తరువాత, వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకోవడానికి సెలవు ఉంటుంది. 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించేందుకు మంగళవారం ఉదయం 10.10 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశ పెడుతారు. ఇంతకుముందు, 2021-22లో మొదటిసారి పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు.

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. పెగాసస్ గూఢచర్యం కేసు, తూర్పు లడఖ్‌లో చైనా ‘చొరబాటు’ వంటి అంశాలు ప్రముఖంగా ఉన్న అనేక సమస్యలపై ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టడానికి సన్నాహాలు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కూడా ఈరోజు సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/