ఆర్ఆర్ఆర్ వాయిదాతో హీరోలే కాదు రాజమౌళి సైతం డిప్రెషన్లోకి వెళ్లిపోయారా..?

జనవరి 07 న పాన్ ఇండియా మూవీ…తెలుగు సినిమా సత్తా చాటే మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని మొన్నటి వరకు నందమూరి అభిమానులు , మెగా అభిమానులే కాదు యావత్ చిత్రసీమ ప్రముఖులు , సినీ ప్రేమికులు ఎదురుచూసారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కావడం లేదనే వార్త తట్టుకోవడం లేదు. అభిమానులతే సోషల్ మీడియా వేదికగా నిర్మాత ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్రెషన్లోకి వెళ్లారు. అయితే కేవలం అభిమానులే కాదు ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో పాటు రాజమౌళి , చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం సైతం డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ తో చరణ్ , తారక్ మెరిశారు. చాలా హుషారుగా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అంతే హుషారుగా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా హ్యూజ్ సక్సెస్ అయ్యాయి. కానీ ఒక్కసారిగా అంత మారిపోయింది. కరోనా , ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమా వాయిదా పడింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు అంత సెట్ అయ్యిందని అనుకునేలోపే అంత రివర్స్ అయ్యింది. ఈ షాక్ తో హీరోలు , రాజమౌళి డిప్రెషన్లోకి వెళ్లారట. చరణ్ అయితే ఆచార్య నుండి మాస్ సాంగ్ విడుదలైనప్పటి కనీసం దానిని చూడలేదని తెలుస్తుంది. మరి ఈ డిప్రెషన్ నుండి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.