ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవదహనం

మ‌నీలా: ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉద‌యం ఘోర అగ్ని ప్రమాదంలో సంభవించింది. ఈఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు. భారీగా జ‌న‌సంద్ర‌మైన ఓ బ‌స్తీలో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతిచెందిన‌ట్లు అధికారులు తెలిపారు. దాంట్లో ఆరుగురు చిన్నారులు ఉన్న‌ట్లు చెప్పారు. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

మొత్తం 80 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. క్వీజ‌న్ సిటీలోని యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఉన్న బ‌స్తీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఇంట్లోని రెండ‌వ ఫ్లోర్ నుంచి మంట‌లు వ్యాపించిన‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ మంట‌ల్ని ఆర్పేందుకు రెండు గంట‌ల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు సీనియ‌ర్ ఫైర్ ఆఫీస‌ర్ గ్రెగ్ బిచ్‌యాదా తెలిపారు. మంట‌లు వేగంగా వ్యాపించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు త‌ప్పించుకునేందుకు ఇబ్బందిప‌డ్డారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/