పాత వీడియోను తెరపైకి తెచ్చిన ఎంపి సంతోష్‌

సిఎం కెసిఆర్‌ను మోడి పొగిడిన వీడియో

Joginapally Santosh Kumar
Joginapally Santosh Kumar

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రధాని నరేంద్ర మోడి పొగడ్తలతో ముంచెత్తిన ఓ సందర్భాన్ని టిఆర్‌ఎస్‌ ఎంపి తెరపైకి తెచ్చారు. సిఎం కెసిఆర్‌ గొప్పతనాన్ని చాటడానికి టీఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొని ఉండడంతో, బిజెపిని ఆత్మరక్షణ ధోరణిలో పడేసేందుకు సంతోష్ కుమార్ ప్రధాని మోడి మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో మోడి సిఎం కెసిఆర్‌ ను అపర భగీరథుడి కంటే ఎక్కువ అనేంతగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం మనం చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పథకాన్ని తీసుకువచ్చిన కెసిఆర్‌ ఆలోచన ఎంతో గొప్పది అంటూ కీర్తించారు. అప్పట్లో టిఆర్‌ఎస్‌, బిజెపి మధ్య పెద్దగా విభేదాలు లేని రోజుల్లో మోదీ పొగడ్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. అయితే ఇప్పుడా పాత వీడియో సాయంతో మోడి సైతం కెసిఆర్‌ గొప్పతనాన్ని అంగీకరించాడని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు సంతోష్ కుమార్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/