అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలిః మంత్రి కెటిఆర్

తాము కూడా తమ పిల్లల్ని సమానంగా చూస్తున్నామన్న కెటిఆర్

boys-and-girls-are-same-says-minister-ktr

హైదరాబాద్ః అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలని… అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. ఈ విషయంలో మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే ఆలోచనను మన ఇంటి నుంచే నేర్పిస్తున్నామని, ఇది సరికాదని చెప్పారు. తన తల్లిదండ్రులు తననే కాకుండా, తన చెల్లెలు కవితను కూడా బాగా చదివించారని… ఇద్దరినీ సమానంగా పెంచారని అన్నారు. కవిత అమెరికాకు వెళ్తానంటే తన కంటే ముందే అక్కడకు పంపించారని చెప్పారు. తన కంటే ముందే కవిత అమెరికాకు వెళ్లిందని తెలిపారు. తాము కూడా తమ పిల్లలను సమానంగా చూస్తున్నామని అన్నారు. పిల్లలకు నమ్మకం కలిగిస్తే… వంద శాతం అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు. ఇంజినీర్, డాక్టర్, లాయర్ కావాలని ఇంట్లో చెపుతుంటారని… వాళ్లు వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. హైదరాబాద్ వీ హబ్ 5వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు.