క్యూబా-వెనిజులా సమావేశం

చమురు రంగంలో సహకారంపై భేటీ

Venezuela and Cuba
Venezuela and Cuba

కారకస్‌ : భవిష్యత్తులో ఆర్ధిక, చమురు రంగాలలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేసేందుకు వెనిజులా, క్యూబా సమావేశమయ్యాయి. సమావేశం అనంతరం వెనిజులా పెట్రోలియం శాఖ మంత్రి మాన్యుల్‌ క్యువెడో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. గతంలో కుదుర్చుకున్న సమగ్ర సహకార ఒప్పందం ప్రకారం వెనిజులా క్యూబాకు ఔషధాలు, ఆహార ఉత్పత్తులను సమకూర్చితే, అందుకు ప్రతిగా వెనిజులా చమురు సరఫరా చేస్తోంది. వీటితోబాటు పర్యాటకం, విదేశీ వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని కూడా బలోపేతం చేసుకునే అంశాన్ని కూడా చర్చించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/