ఫస్ట్ టైం షర్మిల ఫై కేటీఆర్ కామెంట్స్

ఫస్ట్ టైం షర్మిల ఫై కేటీఆర్ కామెంట్స్

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ ప్రకటించినప్పటి నుండి కేసీఆర్ సర్కార్ ఫై , కేటీఆర్ ఫై విమర్శలు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పటివరకు తెరాస నేతలు కానీ కేటీఆర్ కానీ షర్మిల కామెంట్స్ ఫై మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం కేటీఆర్..షర్మిల పార్టీ ఫై చివాట్లు పెట్టాడు. వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌, బీఎస్పీ నేత ప్ర‌వీణ్‌కుమార్ జాతీయ పార్టీల‌కు తొత్తుల‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌పై త‌ప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ష‌ర్మిల ఎందుకు మాట్లాడ్డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని కేటీఆర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మరి కేటీఆర్ కామెంట్స్ ఫై షర్మిల ఎలా రియాక్షన్ ఇస్తుందో చూడాలి.