సార్ కాల్చేయండి మమ్మల్ని… చచ్చిపోతాం

నల్ల జెండాతో నిరసన తెలిపిన వృద్ధ రైతు

Farmer-police
Farmer-police

అమరావతి: ఏపిలో మూడు రాజధానులపై కేబినెట్‌ నిర్ణయం పై అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా రాజధాని గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అసెంబ్లీ వైపు దూసుకెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధ రైతు చేతిలో నల్ల జెండా పట్టుకుని ఓ పోలీసు అధికారితో మాట్లాడిన మాటలు హృదయమున్న ఎవర్నయినా కదిలింపచేస్తాయి. ‘మేం నిరసన తెలియజేస్తున్నాం సార్, ఈ జెండాతో ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు కదా సార్. మేం చిన్న రైతులమండీ. అన్నీ పోగొట్టుకున్నాం. కనీసం నిరసన అన్నా తెలియజేయనివ్వండి సార్. భూదేవి తల్లిని వదిపెట్టేశాం… ఇంకెందుకు సార్ మేం, కాల్చేయండి మమ్మల్ని… చచ్చిపోతాం! ఇంకేం చేసేమండీ మేము శుభ్రంగా చచ్చిపోతాం… ఇదేం అమానుషం అండీ!’ అంటూ నిరసన కొనసాగించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/