టాలీవుడ్ ..జగన్ ఫై ఇలా పగ తీర్చుకుంటుందా..?

ఎన్నికలు వచ్చాయంటే చాలు అందరి కళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫైనే ఉంటుంది. టాలీవుడ్ పెద్దలు ఎవరికీ మద్దతు ఇస్తారు..? ఏ పార్టీ కి జై కొడతారు..? ఎవరు..ఎవరికీ ప్రచారం చేస్తారు..? అనేది తెలుసుకునే పనిలో ఉంటారు. గత ఎన్నికల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ సైలెంట్ గా ఉన్న..ఈసారి మాత్రం జనసేన వైపే జై కొడుతుంది. మొన్నటి వరకు అంత సైలెంట్ గా ఉన్నారు. దీంతో అందరు ఈసారి కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరికీ మద్దతు తెలిపారు కావొచ్చు అని అనుకున్నారు..పవన్ కళ్యాణ్ మరోసారి ఒంటరి వాడే అని అధికార పార్టీ నేతలు భావించారు..కానీ ఇండస్ట్రీ మాత్రం టైం చూసి జగన్ ఫై పగ తీర్చుకోవడం మొదలుపెట్టారు.

జగన్..ఇండస్ట్రీ ని చాల ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో. పవన్ సినిమా రిలీజ్ టైం లో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం..అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం..థియేటర్స్ తనిఖీల పేరుతో హడావిడి చేయడం ఇలాంటివి ఎన్నో చేసారు. అలాగే సినిమా పెద్దలను రప్పించుకొని వారితో బ్రతిమాలాడించుకున్నాడు కూడా..ఇదంతా సినిమా వాళ్లకే కాదు సినీ లవర్స్ కు , అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. కానీ ఇప్పుడు ఏంచేయలేం..టైం వస్తుంది అప్పటి వరకు సైలెంట్ గా ఉందాం అని అనుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది..వారి తడాఖా చూపించడం మొదలుపెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి సంపూర్ణేష్ బాబు వరకు అంత పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ జనసేన కు జై కొడుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ , సాయి తేజ్ వంటి మెగా హీరోలు పిఠాపురం లో ప్రచారం చేయగా..తాజాగా హీరో నాని , సంపూర్ణేష్ బాబు, రాజ్ తరుణ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. అలాగే నిర్మాత నాగవంశీ సైతం నేరుగా ప్రచారం మొదలుపెట్టారు. ఇక బుల్లితెర నటీనటులు సైతం గత 20 రోజులుగా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇక వీరు మాత్రమే కాదు ఇంకా చాలామంది జనసేన కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు మీమున్నాం అని చెపుతున్నారు.ఇక సినీ ఇండస్ట్రీ పవన్ కు మద్దతు తెలుపుతుండడం తో పార్టీ శ్రేణులు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.