మోడీ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ సూటి ప్రశ్నలు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ లో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అవి ఏంటి అంటే..

దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి
దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లు అడగండి
ప్రధానిగా పదేండ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి
ఒక తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి..
మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు పాతరేశారో చెప్పండి
మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండి
మా నవతరానికి కొండంత భరోసానిచ్చే ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి
తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షల మంది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి..
తెలంగాణకు ఒక నవోదయ, ఒక మెడికల్‌ కాలేజీ,
ఒక నర్సింగ్‌ కళాశాల, ఒక ఐఐటీ, ఒక ట్రిపుల్‌ ఐటీ,
ఒక ఐఐఎం, ఒక ఐసర్‌, ఒక ఎన్‌ఐడీ అయినా ఎందుకివ్వలేదో చెప్పండి
సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గు ప్పిట్లో పెట్టుకుని మా రైతులపై ఎం దుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండి..
లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా, 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా..
కాంగ్రెస్‌ సరారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా తెలంగాణవైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి
చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి
తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ రాష్ట్రాలకు ఎందు కు తన్నుకుపోతున్నారో చెప్పండి..
మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పండి
ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి
భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి..
సబ్‌ కా సాత్‌, అచ్చే దిన్‌ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి
పదేండ్లు గడిచినా మీ పాలనలో ఉచిత రేషన్‌ పథకం కింద ఇంకా 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండి
అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి, రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి..
అంబేదర్‌ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి
అదే రాజ్యాంగాన్ని అందరి కండ్లముందే కాలరాయకండి!
దేశ ప్రధానమంత్రిగా, ప్రధాన సమస్యలను పరిషరించకుండా
ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి!!
దేశం కోసం ఏదైనా ‘విజన్‌’ ఉంటే చెప్పండి. కానీ, దయచేసి సమాజంలో ‘డివిజన్‌’ మాత్రం సృష్టించకండి. చివరగా ఒక మనవి.. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇకడ ఓట్లు పడవు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ. ప్రజా చైతన్యానికి అడ్డా.

అంటూ పలు ప్రశ్నలు సంధించారు. మరి వీటికి మోడీ కానీ , బిజెపి నేతలు కానీ ఎవరైనా సమాదానాలు చెపుతారో చూడాలి. మరికాసేపట్లో ప్రధాని మోడీ మామునూరుకు చేరుకోనున్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ (BJP) వర్గాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.తారు.నేడు ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి (Tirupathi) ఎయిర్‌పోర్టుకు బయలు దేరనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ బయలు దేరనున్నారు.

అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియంకు బయలు దేరనున్నారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి మోదీ బయల్దేరి వెళ్తారు.