మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బిజెపి హవా

20 స్థానాల్లో బిజెపి జోరు
7 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీఎస్పీ పైచేయి

BJP
BJP

భోపాల్‌: మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి హవా కొనసాగుతోంది. ఈరోజు ఓట్ల లెక్కింపు కాగా, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిజెపి 20 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మొరెనా నియోజకవర్గంలో బీఎస్పీది పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ లో తమదే హవా కావడంతో మధ్యప్రదేశ్ బిజెపి శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ నేతలు, కార్యకర్తలు వేడుకలు షురూ చేశారు. అయితే, మధ్యప్రదేశ్ బిజెపి సర్కారులోని ముగ్గురు మంత్రులు తమ ప్రత్యర్థులకన్నా వెనుకబడి ఉండడం గమనార్హం. సుమావోలి నియోజకవర్గంలో ఐదాల్ సింగ్ కన్సానా, దిమాని నియోజవకర్గంలో గిరిరాజ్ దండోత్, మెహగావ్ నియోజకవర్గంలో ఓపీఎస్ భదోరియా వెనుకంజలో ఉన్నారు. అటు, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింథియా ఆధిక్యంలో ఉన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/bjp-leading-in-madhya-pradesh/