7న ఒంగోలులో సీఎం జగన్‌ పర్యటన

ఒంగోలులో ఆసరా రెండోవిడత రుణమాఫీని ప్రారంభించనున్న జగన్

అమరావతి: ఈ నెల ఏడో తేదీన సీఎం జగన్‌ ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసరా కింద మహిళలకు రూ. 6,400 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల తర్వాత ఒంగోలు వస్తున్నట్టు చెప్పారు. పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

ఒంగోలులో సీఎం పాల్గొనే కార్యక్రమ వేదిక, హెలీప్యాడ్ స్థలాలను బాలినేని, సీఎం పర్యటన కార్యక్రమాల పర్యవేక్షకులు టి.రఘురాం, సీఎం సెక్యూరిటీ అధికారి వకుల్ జిందాల్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గర్గ్ పరిశీలించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/