చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్ర పనుతున్నారు : లోకేష్‌

They are plotting to kill Chandrababu in jail: Lokesh

అమరావతిః స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు జైల్లో ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జైల్లో చంద్రబాబును చంపేస్తారేమోనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యత అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందని తెలిపారు. ఈ మేరకు లోకేశ్‌ సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.

“మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు గారికి ఏం జరిగినా సైకో జగన్‌దే బాధ్యత”’’ అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.