నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జా!

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయనకు చెందిన భూమి కబ్జా గురైంది. చంద్రబాబు స్థలంలో రాజేంద్రనాయుడు అనే వ్యక్తి ఫెన్సింగ్ వేశారు. దీంతో చంద్రబాబు బంధువులు రాజేంద్రనాయుడుని అడ్డుకున్నారు. 38సెంట్ల స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో చంద్రగిరి తహశీల్దార్ కి ఫిర్యాదు చేశారు.

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1989లో సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు. ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్​లైన్​లో నమోదు చేసుకోకపోవడంతో.. అదే అదనుగా భావించిన రాజేంద్ర నాయుడు.. భూమిని కబ్జా చేసేందుకు రాతి కుసాలు నాటుతున్నారు.ఈ భూమికి సంబంధించిన పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో ప్రతి సంవత్సరం నారా భువనేశ్వరి సంక్రాంతి పర్వదినాన రంగవల్లులు, క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/