రాజధాని గ్రామాలు బోర్డర్‌ను తలపిస్తున్నాయి

పాకిస్థాన్‌ బోర్డర్‌లో కూడా ఇంతమంది పోలీసులు ఉండరు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ బోర్డర్‌లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని ఆయన విమర్శించారు. అన్యాయంగా, కౄరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాజధానిలో యుద్ధవాతావరణం తీసుకొస్తున్నారని లోకేష్‌ దుయ్యబట్టారు. ఇంకా వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందని ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా రాజధాని ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం మానుకోవాలని నారా లోకేష్‌ హితవు పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/