మేడారం జాతరకు 50 శాతం బస్సుఛార్జీలు పెంపు

Medaram Jatara
Medaram Jatara

హైదరాబాద్: మేడారం జాతర కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆర్‌టిసి బస్సు సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్‌టిసి రీజనల్ నుంచి 4వేల బస్సులు నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు 23లక్షల మంది భక్తులను చేరవేసేందుకు 4వేల బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఆర్‌టిసి నుంచి ఈసారి 12,500 మంది విధుల్లో ఉంటారని, వీరిలో అధికారులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు. మేడారం బస్‌స్టేషన్ వద్ద సిసి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తామని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు రూ.440, జనగామ నుంచి మేడారం జాతరకు రూ.280, మహబూబాబాద్ నుంచి మేడారం జాతరకు రూ.270, కాళేశ్వరం నుంచి మేడారం జాతరకు రూ.260, వరంగల్ నుంచి మేడారం జాతరకు రూ.190 బస్సు ఛార్జీలు ఉంటాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/