మరోసారి ఉద్రిక్తత..చైనాకు దీటుగా బదులిచ్చిన భారత్‌

చైనా ద‌ళాల‌ను అడ్డుకున్న భార‌త ఆర్మీ

india-china-clash-at-pangong-lake-in-eastern-ladakh

న్యూఢిల్లీ: లడఖ్‌ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. గాల్వన్‌లో ఉద్రిక్తతల అనంతరం చైనాభారత్ మధ్య ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశల వారీగా ఆర్మీని వెనక్కి రప్పించాలనే ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. చైనా నిన్న, మొన్న తూర్పు లడఖ్‌, ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద స్టేటస్‌ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా భారత ఆర్మీ వెంటనే చైనా యత్నాలను తిప్పికొట్టింది. దీంతో చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం ఉద్రిక్తతలను తగ్గించేందుకు చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో భారత్‌చైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/