అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదు

పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని..పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జగరుతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 3 రాజధానులు పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. రాజధాని తరలింపుపై హైకోర్టు చెప్పిన తర్వాత కూడా జీవోలు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అర్థరాత్రి కార్యాలయాలు ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇది కోర్డు దిక్కారం కాదా? ప్రభుత్వాన్ని అని నిలదీశారు. ఏపీ రాజధాని అమరావతిని చంపెస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఓ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే రాజధానిపై ముడు కమిటీలు వేశారని దుయ్యబట్టారు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తే తప్పన్న వైఎస్సార్‌సిపి నేతలు ..విశాఖలో ఇప్పుడెందుకు భూ సమీకరణ చేపట్టారని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/