తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసహనం

పబ్బులు, మద్యం దుకాణాలు నడపడటమే ముఖ్యమా?

TS High Court
TS High Court

Hyderabad: కరోనా వైరస్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సినిమా థియేటర్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది.వీటిపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని న్యాయస్థానం ఆరోపించింది. పబ్బులు, మద్యం దుకాణాలు నడపడడమే ప్రభుత్వానికి ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా తాము ఆదేశాలు ఇవ్వాలా అని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భోజన విరామం తర్వాత తిరిగి ఈ అంశంపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/