ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్

ఇవాళ రాత్రి నుంచే అమలులోకి : సిఏం కేజ్రీవాల్

Lockdown for a week in Delhi-CM Kejriwal
Lockdown for a week in Delhi-CM Kejriwal

New Delhi: ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 26 ఉదయం వరకు కొనసాగుతుందని, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ,ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ విషయం విదితమే. ఇప్పటికే ఐసోలేషన్ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయని సీఎం తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి ఘోరంగా ఉందని, రోజుకు 25 వేల మందికి వైరస్ నిర్ధారణ అవుతోందని తెలిపారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తాయని, ప్రైవేట్ కార్యాలయాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు చేయాలని ఆదేశించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/